News February 11, 2025
ధర్మపురి: టికెట్ల ద్వారా రూ.74,446 ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సోమవారం రూ.1,53,552 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.74,446 రూపాయలు, ప్రసాదాల ద్వారా 62,510 రూపాయలు, అన్నదానం కోసం 16,596 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 17, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభం

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెగ్యులర్ ధరలతో టికెట్లు అందుబాటులో ఉండటంతో ధరల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఈ నెల 19న ఉ.7.30 గంటలకు మొదటి షో పడనుంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం <<19374694>>అనుమతినిచ్చిన<<>> సంగతి తెలిసిందే. అక్కడ ఉ.4 గంటలకు బెనిఫిట్ షో పడనుంది.
News March 17, 2026
దోర్నాల: ఈనెల 16 నుంచి 20 వరకు గేట్లు ఓపెన్

శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ దోర్నాల గణపతి చెక్ పోస్ట్ నుంచి రాత్రి వేళల్లో కూడా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ రాత్రి వేళల్లో కూడా వాహనాలు శ్రీశైలానికి వెళ్తున్నాయి. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 16 నుంచి 20 వరకు అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 17, 2026
జగిత్యాలలో పసుపు క్వింటాల్ రూ. 11,500

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు(పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ రూ.11,500, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,000, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,791, కనిష్ఠం రూ. 1,521, కందులు గరిష్ఠం రూ. 6,911, కనిష్ఠం రూ. 5,636, పెసర్లు రూ. 7,250, అనుములు గరిష్ఠం రూ. 4,556, కనిష్ఠం రూ. 3,000, వరి (JSR) గరిష్ఠం రూ. 2,601, కనిష్ఠం రూ. 1,755గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


