News February 11, 2025

రామగుండం: ‘ATC భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి’

image

రామగుండం ITI సెంటర్ ఆవరణలో జరుగుతున్న ATC భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ అన్నారు. రామగుండానికి వచ్చిన ఆయనను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలిసి పూల మొక్కతో స్వాగతించారు. 6 ట్రేడ్‌లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు నిర్మిస్తున్న ATCభవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. పెద్దపల్లి RDOగంగయ్య, ప్రిన్సిపల్ సురేందర్ ఉన్నారు.

Similar News

News March 16, 2026

విస్తారంగా వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వర్షం కురిసింది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, APలోని అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.