News February 11, 2025
సిరిసిల్ల: చందుర్తిలో బెల్ట్ షాపులపై దాడులు

చందుర్తి మండలం రామరావుపల్లె, ఎనగల్, జోగాపూర్ గ్రామాల్లోని బెల్టుషాపులపై CHD పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఎన్గల్ గ్రామానికి చెందిన కుసుంభ లింగయ్య వద్ద రూ.7,630 విలువ గల మద్యాన్ని, జోగాపూర్‌లో రూ.3,850 విలువ గల మద్యం, రామరావుపల్లె గ్రామానికి చెందిన ముని రాములు వద్ద రూ.17,650లు మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్‌హెచ్ఓ ఆశోక్ కుమార్ తెలిపారు.
Similar News
News October 22, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 22, 2025
యూడైస్‌లో పేరుంటేనే ఇంటర్ పరీక్షలకు!

TG: యూడైస్(యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫమేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నిబంధన ఇంటర్ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో పేరు నమోదు తప్పనిసరని, అలా ఉంటేనే ఇంటర్ పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. యూడైస్‌లో పేరు లేకుంటే ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు వీలు ఉండదు. ఇప్పటివరకు 75% విద్యార్థుల పేర్లు నమోదవ్వగా మరో 25% పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్ తప్పుల సవరణ దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.