News February 11, 2025
AP కాస్ట్ సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవు: హైకోర్టు

ఏపీ ప్రభుత్వం జారీ చేసే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని TG హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను విచారించింది. TG ప్రభుత్వం జారీ చేసిన SC సర్టిఫికెట్ ఉన్న వాళ్లే ఇక్కడ రిజర్వేషన్‌కు అర్హులని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం AP SC కాస్ట్ సర్టిఫికెట్ పత్రం TGలో చెల్లదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో CJ ధర్మాసనం ఏకీభవించింది.
Similar News
News April 3, 2026
‘మావిగన్’తో బాబుకు భయం పట్టుకుంది: అంబటి

AP: ‘మావిగన్’ రాష్ట్ర అభివృద్ధి మంత్రమని, దాన్ని తట్టుకోలేకే ఎల్లో బ్యాచ్ ట్రోలింగ్ చేస్తోందని YCP నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. ‘‘జగన్ ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ‘మావిగన్’ను ప్రజలు అమోదించే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి ఇప్పట్లో పూర్తయ్యేది కాదు. CBN ఇవాళ అదే చెప్పారు. 7భవనాలతో సరిపెట్టాలని చూస్తున్నారు. నవ నగరాలు ఏమయ్యాయో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘మావిగన్’తో ఆయనకు భయం పట్టుకుందన్నారు.
News April 3, 2026
నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? జాగ్రత్తలు ఇవే

*డ్యూటీ వేళల్లో కూల్ డ్రింక్స్, టీ లాంటివి పూర్తిగా తగ్గించాలి. బ్రేక్‌లో పళ్లరసాలు తీసుకోవడం మంచిది.
*షిఫ్ట్ ముగిశాక గోరువెచ్చటి నీటితో స్నానం చేసి నిద్రపోవాలి.
*భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో పడుకోవద్దు.
*ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేందుకు తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు తీసుకోవాలి
*యోగా, వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు.
News April 3, 2026
IPL: టాస్ గెలిచిన PBKS

చెన్నై వేదికగా CSKతో జరగనున్న మ్యాచులో PBKS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, ప్రశాంత్ వీర్, దూబే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
PBKS: ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్, చాహల్


