News February 11, 2025
KMR: రాష్ట్ర స్థాయి పోటీలకు 25 మంది ఎంపిక

ఓయూలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు కామారెడ్డి జిల్లా నుంచి 25 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి ట్రయథ్లాన్ సెలక్షన్స్ నిర్వహించారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అభినందించి గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలు అందించారు.
Similar News
News March 26, 2026
ఇకపై అమరావతిలోనే శిక్షణ

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శిక్షణ సంస్థ- APSIRD & PR క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ క్యాంపస్‌కై అమరావతిలోని కురగల్లు, నవులూరులో 5.043 ఎకరాల భూమిని CRDA కేటాయించగా.. సంబంధిత లీజు అగ్రిమెంట్ బుధవారం పూర్తయ్యింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ అధికారి రాధామాధవికి, CRDA అధికారి జుబిన్ రాయ్ పత్రాలను అందజేశారు.
News March 26, 2026
కృష్ణా: ఆన్‌లైన్ మోసం.. రూ.55.20 లక్షల దోపిడి

కానూరుకి చెందిన యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి ఆన్‌లైన్ మోసానికి గురై రూ.55.20 లక్షలు కోల్పోయాడు. యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పిన వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి ELITE OTC VAULTలో పెట్టుబడులు పెట్టించారు. మొదట రూ.22.20 లక్షలు పెట్టించిన వారు, నకిలీ లాభాలు చూపించి ప్రాసెసింగ్, సర్వీస్ ఛార్జీల పేరుతో మరింత డబ్బు వసూలు చేశారు. తరువాత మోసం తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News March 26, 2026
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ 39.1°C, పెర్కిట్ 39, మెండోరా, జక్రాన్ పల్లి, నిజామాబాద్(సౌత్) 38.9, బాల్కొండ, Ch.కొండూరు, మల్కాపూర్ 38.8, పిట్లం, భిక్కనూరు, కామారెడ్డి(IDOC) 38.6, ఎల్పుగొండ, హాసన్ పల్లి 38.5°C లుగా నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా నిజామాబాద్ లోని 47, కామారెడ్డి లోని 30 వెదర్ స్టేషన్ల లో 35°C లకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


