News February 11, 2025
ADB: ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన ప్రజ్ఞ కుమార్

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రత్నజాడే ప్రజ్ఞ కుమార్ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
Similar News
News March 24, 2026
పీఎం పథకాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్

పర్యావరణ హిత ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ‘పీఎం సూర్య ఘర్’ (రూఫ్ టాప్ సోలార్), ‘పీఎం కుసుమ్’ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు ₹78,000 వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. దీనిని బ్యాంకర్లు తమ లోన్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన భాగంగా చేర్చుకోవాలని పేర్కొన్నారు.
News March 24, 2026
నిధులను డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలి: ADB కలెక్టర్

రైతు భరోసా నిధులను రైతులు డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలని కలెక్టర్ రాజర్షిషా బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల పంపిణీలో బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
News March 24, 2026
సీసీటీవీ విస్తరణతో నేరాల నియంత్రణ సాధ్యం: ఆదిలాబాద్ ఎస్పీ

జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఎస్పీ అఖిల్ మహాజన్ కీలక సూచనలు చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలు, గ్యాంబ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. సీసీటీవీల ఏర్పాటును ఉద్యమంలా చేపట్టాలని, రోడ్డు భద్రతపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్‌ల నమోదు పెంచి, ప్రతి కేసును క్షుణ్ణంగా సమీక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.


