News February 11, 2025
కొత్తగూడెం బస్ డిపో వద్ద మృతదేహం కలకలం

కొత్తగూడెం బస్ డిపో వద్ద గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని 1 టౌన్ పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తికి 45 ఏళ్ల వయసు ఉంటుందని, తెల్ల గీతలు ఉన్నచొక్క, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మనిషి నలుపు రంగులో ఉన్నాడని, చనిపోయి ఉన్న ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. వన్ టౌన్ సీఐ 8712682017, ఎస్ఐ 8712682019 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 19, 2025
ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారించాలి: కలెక్టర్

ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ అర్జీలు అందజేశారు. న్యాయమైన, పరిష్కరించుటకు అవకాశం గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News September 19, 2025
ADB: ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై సమీక్ష

విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ఈ సమావేశంలో పాల్గొని, విద్యార్థులు వేసిన డ్రాయింగ్‌లు, ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు ఈ కార్యక్రమం వల్ల తమలో వచ్చిన మార్పులను వివరించారు. ఛాంపియన్ విద్యార్థుల సందేశాలను కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు సూచనలు చేశారు.
News September 19, 2025
నేటితో జిల్లాలో 29065 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా: DAO

ఇప్పటి వరకు జిల్లాలో 29065 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు DAO విజయనిర్మల తెలిపారు. బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో యూరియా సరఫరా జరుగుతున్న సరళిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్రతి నిత్యం పరిస్థితిని గమనిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ, జిల్లాకి అదనపు యూరియా కోట కోసం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు.