News February 11, 2025

NZB: జిల్లా ఓటర్లు ఎంతమందంటే?

image

నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఓటర్ల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 3,751 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 2001, ఆర్మూర్ డివిజన్‌లో 1049, బోధన్ డివిజన్లో 701 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

Similar News

News March 23, 2026

NZB: తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

image

ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆర్.డబ్ల్యూ,ఎస్, పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎం.పీ.ఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అవసరమైన చోట చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు.

News March 23, 2026

NZB: సస్పెన్షన్ కాదు.. మరింత కఠిన చర్యలు: కలెక్టర్

image

విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ, పైవిధంగా హెచ్చరికలు చేశారు.

News March 23, 2026

NZB: ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 140 ఫిర్యాదులు అందాయి.