News February 11, 2025
రైతులకు అందుబాటులో ఎరువులు: డీఏఓ రాధిక

సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి అవసరం అయినా ఎరువులు అందుబాటులో ఉన్నాయని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధికా తెలిపారు. ఎరువుల సరఫరాపై సోమవారం డిఏఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఏంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు పంటలకు కావాల్సిన ఎరువులు తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News July 6, 2025
తిర్యాణి: పశువుల మందపై పెద్దపులి దాడి?

తిర్యాణి మండలం ఎదులపాడు శివారులోని అటవీ ప్రాంతంలో పశువుల మందపై పెద్దపులి దాడి చేసిందని పశువుల కాపరులు తెలిపారు. పశువులను మేతకోసం అడవిలోకి తీసుకెళ్లగా వాటిపై ఒక్కసారిగా దాడి చేసిందని వెల్లడించారు. ఈ క్రమంలో తాము గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయిందని పేర్కొన్నారు. ఎదులపాడు, ఎగిండి అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఎవరు వెళ్లొద్దని కాపరులు సూచిస్తున్నారు. పులి సంచారంపై అధికారులు క్లారిటీ ఇవాల్సి ఉంది.
News July 6, 2025
రేపటి నుంచి 8 గంటల ముందే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.
News July 6, 2025
31 మంది మందుబాబులకు జైలు శిక్ష: వరంగల్ CP

మద్యం తాగి వాహనం నడపిన 31 మందికి జైలు శిక్ష విధించినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. అలాంటి ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డ సందర్భాలూ ఉన్నాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.