News February 11, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇంద్ర గౌడ్ నామినేషన్

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి సిలివేరి ఇంద్ర గౌడ్ సోమవారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా పోటీ చేశానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Similar News

News November 8, 2025

యుద్ధానికి సిద్ధం.. పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

image

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి చర్చలు విఫలం అయ్యాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ కారణంగానే ఈ సందిగ్ధత ఏర్పడిందని అఫ్గాన్ ఆరోపించింది. అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ను తాలిబన్ సర్కార్ హెచ్చరించింది. ఇక నాలుగో విడత చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని పాక్ ప్రకటించింది.

News November 8, 2025

గద్వాల: రేపు న్యాయవాదుల పాదయాత్ర

image

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం 9:00 గంటలకు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయం నుంచి హైదరాబాద్‌ వైపు పాదయాత్ర మొదలవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ బంధువులందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

News November 8, 2025

సూళ్లూరుపేట: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

image

సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో శనివారం విషాదకర ఘటన జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ వివాహిత వరలక్ష్మి(24) తన ఇద్దరు పిల్లలు వర్షత్ (4), ప్రశాంత్( 2)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.