News February 11, 2025
MNCL: పెద్దపులి ఎక్కడికి చేరిదంటే..!

గత 12రోజులుగా బెల్లంపల్లి, కాసిపేట మండలాల అటవీ ప్రాంత ప్రజలను పెద్దపులి భయాందోళనకు గురి చేసింది. తాజాగా తాండూరు మండలం అటవీ ప్రాంతంలోకి పయనమైంది. మండలంలోని మాదారం గొంతెమ్మగుట్ట ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, బీట్ ఆఫీసర్ భాస్కర్ తెలిపారు. పెద్దపులి తీర్యాణి, రెబ్బన మండలం పులికుంట వైపు వెళ్లి ఉండొచ్చనే కోణంలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
తిరుపతి: ఈ విద్యార్థులు బంగారం.!

వెంకటగిరిలో విద్యార్థులు తమకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పి మానవత్వం చాటుకున్నారు. కాజీపేటలో మార్గంలోని SBI బ్యాంక్ సమీపంలో రోడ్డుపై ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6,28,500 విలువ గల 4.5 సవర్ల బంగారం దొరికింది. వారు బంగారాన్ని ఎస్ఐ స్వరూపకు అందించారు. ఆ బంగారం పట్టణంలోనిమహాలక్ష్మిదిగా గుర్తించి ఆమెకు అప్పగించారు. ఈ మేరకు విద్యార్థులను SI, బాధితురాలు అభినందించారు.
News March 5, 2026
వాహనాలపై కొత్తగా రహదారి భద్రతా సెస్: మంత్రి

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు GOVT కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కొత్తగా 10% రహదారి భద్రతా సెస్‌ను విధించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్‌తో పాటు దీన్ని వసూలు చేస్తారు. ఏడాదికి ₹270CR వస్తుంది. రహదారి భద్రతా సదుపాయాలు, బ్లాక్‌స్పాట్ల మెరుగుదలకు దీన్ని వినియోగిస్తాం’ అని తెలిపారు. ఈమేరకు సవరణ బిల్లును మంత్రి సభలో ప్రవేశపెట్టారు.
News March 5, 2026
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.. లిమిట్ దాటితే!

కొందరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. కానీ IT చట్టం ప్రకారం లిమిట్ దాటితే అధికారులు నోటీసులు పంపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10L కంటే క్యాష్ డిపాజిట్ చేసినా అధికారులు ఐటీ శాఖకు ఇన్ఫార్మ్ చేస్తారు.₹10L కంటే విలువైన విదేశీ వస్తువులు, ప్రయాణాలు చేసినా ఐటీ క్వశ్చన్ చేస్తుంది. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లులు ఉన్నా నోటీసులు రావొచ్చు.


