News March 20, 2024

SKLM: రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు

image

ఆముదాలవలసలో గల శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఓ కార్మికుడు డ్రిల్లింగ్ మిషన్‌ను ఆపకుండా వదిలేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో ఆ డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్ పై ఓ ప్రయాణికురాలి కాలుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే కాలు విరగడంతో 108లో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 21, 2025

నౌపడ: కోడిపందాలు కేసులో ఐదుగురి అరెస్ట్

image

సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన దాడుల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పందెంకి వినియోగించిన సామగ్రి తో పాటు రూ. 3,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నౌపడ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి  కేసు నమోదు చేశారు.

News April 21, 2025

శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 21, 2025

ఎచ్చెర్ల: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26న మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమానికి ఎచ్చెర్ల పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆర్డీవో ప్రత్యుష కార్యక్రమ ఏర్పాట్లకు మత్స్యకార గ్రామాలైన బుడగట్ల పాలెం ,జీరుపాలెం, కొవ్వాడ‌లో స్థల పరిశీలన చేశారు. వీరి వెంట డీఎస్పీ, అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.

error: Content is protected !!