News February 11, 2025

ఖమ్మం: బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి: ఎంపీ

image

కేంద్ర బడ్జెట్‌లో తమ తెలంగాణ ప్రజలను ఎందుకు పట్టించుకోలేదని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేటాయింపుల్లో నిర్లక్ష్యం ఎందుకని లోక్ సభలో ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారని, పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్నా కేటాయింపులు చేయలేదని తెలిపారు. బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి అని హితవు పలికారు.

Similar News

News March 12, 2026

రాష్ట్రంలోనే ప.గో. జిల్లాకు ఫస్ట్ ర్యాంకు

image

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి సంబంధించి IVRS ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 74.1 శాతం సానుకూలతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

News March 12, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఇలా ఉన్నాయి.. జక్రాన్‌పల్లి 38.6°C, పెర్కిట్, కోటగిరి, బాల్కొండ, మంచిప్ప, మెండోరా, కొల్లూరు(బాన్సువాడ) 38.4, సోమూరు 38.3, బిచ్కుంద 38.1, నిజామాబాదు సౌత్, ఎల్పుగొండ, మేనూరు 38, మోస్రా 37.9, పెద్దకొడప్గల్ 37.8, జానకంపేట, భిక్కనూరు 37.7, కమ్మర్పల్లి, ఇస్సపల్లి(ఆర్మూర్) 37.6°Cలుగా నమోదయ్యాయి.

News March 12, 2026

రాజమండ్రిలో అక్రమాల డొంక లాగుతున్న ACB

image

రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండు రోజులుగా ACB అధికారులు చేపట్టిన తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. కార్యాలయంలోని సుమారు 700 పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన అధికారులు, పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. గురువారం నగరవ్యాప్తంగా ACB బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించనుంది.