News March 20, 2024

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

జిల్లాలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్బురాజన్  పేర్కొన్నారు. తదనుగుణoగా ఇతర రాష్ట్రాల నుండీ లిక్కర్, డబ్బు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు జిల్లాలోకి రాకుండా కర్నాటక సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్ పోస్టులో నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలియజేశారు.

Similar News

News March 6, 2026

నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

image

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.

News March 6, 2026

అనంత విద్యార్థులకు ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. Infosys కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 8మంది ఎంపికయ్యారు. వీరికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ హంచాటే సుదర్శనరావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో మంచి అవకాశాలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

News March 5, 2026

బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

image

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.