News February 11, 2025
వనపర్తి జిల్లాలో68, 587 మందికి రైతు భరోసా నిధులు

వనపర్తి జిల్లాలో రెండు ఎకరాల భూమి వరకు ఉన్న రైతులకు వారి బ్యాంకుల ఖాతాల్లో రైతు భరోసానిధులు సోమవారం ప్రభుత్వం నిధులు జమ చేసింది. వనపర్తి జిల్లాలో 68,587 మంది రైతులకు రూ. 34 కోట్ల 40 లక్షల 23 వేల 950లు జమ అయినట్లు విడుదల చేసిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు ఖాతాల్లో పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతగా ఎకరం వరకు ఉన్న రైతులకు ఇదివరకే రైతు భరోసానిధులు జమ చేశారు.
Similar News
News March 18, 2026
HYD: తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి..!

ఇంజినీర్ల బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండేలా నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయం బహుశా తెలంగాణ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు పనిచేయవని సర్క్యులర్ జారీ చేసింది. ఏదైనా సిఫార్సు లేఖతో సంప్రదిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బదిలీల విషయమై అధికార పార్టీ నాయకుల నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News March 18, 2026
PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News March 18, 2026
నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.


