News February 11, 2025

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌కు 3.7B ఏళ్లు?

image

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్‌ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.

Similar News

News February 11, 2025

జేఈఈ రిజల్ట్స్: ఏపీ, టీజీ విద్యార్థులకు 100 పర్సంటైల్

image

జేఈఈ మెయిన్ తొలి సెషన్ <<15430043>>ఫలితాల్లో<<>> తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞ, తెలంగాణకు చెందిన బనిబ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్‌కు 99.99 పర్సంటైల్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది 100 పర్సంటైల్ సాధించారు.

News February 11, 2025

ప్రముఖ క్రికెటర్ రిటైర్మెంట్

image

దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్ రిటైర్మెంట్ ప్రకటించారు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ఇతను ఫస్ట్ క్లాస్+లిస్ట్ A+T20లలో పదివేలకు పైగా పరుగులు చేశారు. ఇందులో 31 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. IPLలో RCB, KKR జట్లు ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం వచ్చింది.

News February 11, 2025

గగన్‌యాన్ ద్వారా స్పేస్‌లోకి ఈగలు.. ఎందుకంటే

image

ఇస్రో చేపట్టిన గగన్‌యాన్-1 మిషన్ ద్వారా ఈగలను (fruit flies) అంతరిక్షంలోకి పంపేందుకు TIFR సిద్ధమవుతోంది. జీవరాశిపై స్పేస్ ట్రావెల్ ప్రభావం, అనుభవించే స్ట్రెస్, జీవ రసాయన మార్పులను తెలుసుకోవడమే ఈ ప్రయోగ లక్ష్యం. మానవుల్లో రోగాలపై ప్రభావం చూపే జెనెటిక్ పాథ్‌వేస్‌ను 75% షేర్ చేసుకుంటుండటంతో ఈగలను ఎంచుకున్నారు. మైక్రో గ్రావిటీ ఉండే స్వల్పకాల స్పేస్ ట్రావెల్‌లో మెటబాలిజం ఫిట్‌నెస్‌‌ను తెలుసుకోనున్నారు.

error: Content is protected !!