News February 11, 2025
మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు (UPDATE)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఈ వివరాలను పంపామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే అందరికీ కార్డులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Similar News
News March 14, 2026
పరవాడ: ఎన్టీపీసీ 2వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ

పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ 2వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని శుక్రవారం పునరుద్ధరించారు. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈనెల 11న విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. ప్రస్తుతం నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు.
News March 14, 2026
6 నెలల్లో స్థానిక ఎన్నికలు: CM

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని, వాటికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. నిన్న క్యాబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని, ఈసారీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.
News March 14, 2026
ఇంటింటికీ కొళాయి.. రూ.860 కోట్లు మంజూరు

ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించేందుకు రూ.860 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉరవకొండకు రూ.480 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గానికి రూ.380 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పయ్యావుల తెలిపారు. ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన CM చంద్రబాబు తాగునీటి సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ మేరకు భారీగా నిధులు ఇచ్చారు.


