News February 11, 2025
సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈ నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు పుణ్యస్నానాలు చేసే ప్రదేశాలలో ప్రజలకు అసవరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మాఘ పౌర్ణమి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News March 19, 2026
పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు

పశ్చిమాసియాలో యుద్ధంతో పాకిస్థాన్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. దీంతో మార్చి 23న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని తెలిపారు. దీంతో సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. దేశ గౌరవానికి నిదర్శనంగా నిలిచే వేడుకలు రద్దు కావడం ఆ దేశ దుర్భర స్థితికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.
News March 19, 2026
నల్గొండ: పుచ్చకాయకు దక్కని ధర: రైతు కుదేలు

ఈ వేసవిలో జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేసిన రైతులు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో సాగు పెరగడం, పంట ఒక్కసారిగా మార్కెట్‌కు రావడంతో గతంలో రూ.30 పలికిన ధర ప్రస్తుతం రూ.6 నుండి 7కి పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News March 19, 2026
హనుమకొండ: పండుగ పూట చికెన్ కేజీ రూ.340

పండుగ పూట చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హనుమకొండలో గురువారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.340 ఉంది. స్కిన్ 320 ఉండగా కోడి ధర 220గా నిర్ణయించారు. ఉగాది పండుగ రోజు చాలామంది పచ్చడి తాగిన అనంతరం నాన్ వెజ్ తింటుంటారు. పండుగ పూట గిరాకీ ఎక్కువగా ఉంటుందని ఆలోచనతో చికెన్ ధర రూ.340కి పెరిగింది. సామాన్యులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒక ఎగ్ ధర రూ.4.45 పైసలుగా ఉంది.


