News February 11, 2025
BHPL: ‘ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి’

ఈ నెల 27న జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
Similar News
News March 14, 2026
BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 తగ్గి రూ.1,59,660కు చేరింది. మూడ్రోజుల్లో రూ.3,650 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.950 పతనమై రూ.1,46,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 14, 2026
భువనగిరి: పది పరీక్షకు వెళ్తుండగా విద్యార్థికి యాక్సిడెంట్

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పరీక్షకు వెళ్తున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పహిల్వాన్‌పురానికి చెందిన స్టూడెంట్ (16) తన స్కూటీపై వలిగొండలోని పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News March 14, 2026
భూపాలపల్లి: ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 122 పాఠశాలలకు చెందిన 3,544 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించగా, 9:30 గంటలకు ప్రశ్నపత్రాలను అందజేశారు. పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.


