News February 11, 2025
మోసపూరిత SMSలపై అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News January 6, 2026
నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.
News January 6, 2026
నెల్లూరు కలెక్టర్ ఐడియా సూపర్..!

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. ఛాంపియన్ ఫార్మర్, కిసాన్ సెల్‌తో ఇతర కలెక్టర్లకు ఆదర్శంగా మారారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ‘వన్ మంత్.. వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అధికారులు ఓ గ్రామానికి నెలకు 4సార్లు వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు. బుచ్చి మండలం మినగల్లులో ఈ కార్యక్రమాన్ని తహశీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
News January 6, 2026
నేను, VPR కలిసి రూ.3.50 కోట్లు ఇస్తాం: బీద

ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని ఎంపీ బీద మస్తాన్ రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు రుణాలను మంజూరు చేయాలని సూచించారు. నెల్లూరులోని బీసీ భవన్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు రూ.4.50కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. మంత్రి నారాయణ రూ.కోటి ఇస్తారని.. మిగిలిన రూ.3.50కోట్లు తాను, వీపీఆర్ ఇస్తామని తెలిపారు.


