News February 11, 2025

ఆగిరిపల్లి: ప్రమాదంలో నలుగురికి గాయాలు

image

ఆగిరిపల్లి మండలం వట్టిగుడుపాడు గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మధుమోహనరావు, వెంకటేశ్వరరావు, మనోహరం, అభిలాష్ లు  ప్రమాదంలో గాయపడినట్లు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

Similar News

News March 17, 2026

WGL: స్తంభించిన రియల్ ఎస్టేట్..!

image

ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ కొంతకాలంగా మందగమనంలో సాగుతోంది. రెండేళ్లుగా క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో అటు వ్యాపారులు, ఇటు రిజిస్ట్రేషన్ శాఖ ఆందోళన చెందుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, 2024లో 1,05,834 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 2025లో 1,03,784, 2026లో ఇప్పటివరకు 19,146 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. గతంలో రోజుకు సగటున 170 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ప్రస్తుతం 40 కూడా దాటడం లేదు.

News March 17, 2026

పల్నాడు: యువతి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఛేజింగ్‌తో సురక్షితం!

image

రొంపిచర్ల మండలం తుంగపాడులో యువతి కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిని బైకులపై వెంబడించిన దుండగులు అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు. అన్నారం వద్ద నిందితుల వాహనాలను స్వాధీనం చేసుకోగా.. పోలీసుల సాయంతో యువతి సురక్షితంగా స్టేషన్‌కు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News March 17, 2026

కొడంగల్ ఎత్తిపోతలపై సీఎం స్పెషల్ ఫోకస్

image

సొంత నియోజకవర్గ దాహార్తిని తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. దాదాపు రూ.4,885 కోట్ల నిధులతో ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా 10 రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.