News February 11, 2025
నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739234232898_367-normal-WIFI.webp)
AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.
Similar News
News February 11, 2025
కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278210117_695-normal-WIFI.webp)
AP: ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న <<15428552>>బర్డ్ ఫ్లూ<<>> కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం(M)లో వైరస్ నిర్ధారణ అయ్యింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల 10KM పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. కాగా 100డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
News February 11, 2025
18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274432161_1045-normal-WIFI.webp)
సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.
News February 11, 2025
ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908652549-normal-WIFI.webp)
జమ్మూకశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.