News February 11, 2025
హెలికాప్టర్ ద్వారా భూ సర్వే నిర్వహించిన వరంగల్ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739235225621_1047-normal-WIFI.webp)
WGL జిల్లాలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ ఏరియల్ భూ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను KZPT నుంచి కలెక్టర్ సత్య శారద హెలికాప్టర్‌లో వర్ధన్నపేటకు బయల్దేరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని చెరువులు, కాల్వలు తదితర వివరాలతో అక్షాంశాలు, రేఖాంశాలుగా సంబంధిత ప్రాంతాన్ని నమోదు చేస్తారన్నారు. మంగళవారంలోగా సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739279435518_52008866-normal-WIFI.webp)
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
News February 11, 2025
వికారాబాద్: 13న రైతులతో సంప్రదింపులు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274851062_20512937-normal-WIFI.webp)
దుద్యాల మండలం లగచర్ల గ్రామ రైతులతో ఈనెల 13న సంప్రదింపుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమావేశం హాల్‌లో ఈనెల 13న మధ్యాహ్నం 1:30 గంటలకు లగచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 102,117,120, 121, అసైండ్ భూమి సర్వే నంబర్ల రైతులతో భూమి ఎకరాకు పరిహారం నిర్ణయిస్తామన్నారు.
News February 11, 2025
స్టాక్‌మార్కెట్ల క్రాష్: 4 నెలల్లో ₹85లక్షల కోట్ల నష్టం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737972487945_1124-normal-WIFI.webp)
స్టాక్‌మార్కెట్లు పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద కనీవినీ ఎరగని విధంగా ఆవిరవుతోంది. గత SEP 27న నిఫ్టీ 26,277 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 3500 పాయింట్లు పడిపోయింది. అంటే 13% పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు నవంబర్లో రూ.31L CR, డిసెంబర్లో రూ.10L CR, జనవరిలో రూ.27L CR, ఫిబ్రవరిలో రూ.15L CR మొత్తంగా సుమారు రూ.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.