News February 11, 2025

రంగరాజన్‌పై దాడిచేసిన వీరరాఘవ రెడ్డి నేపథ్యమిదే..

image

చిలుకూరు బాలాజీ అర్చకుడు <<15409945>>రంగరాజన్‌పై దాడిచేసిన<<>> వ్యక్తి వివరాలు బయటకొచ్చాయి. తూ.గో. జిల్లా కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించి తాము ఇక్ష్వాకుల వంశస్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఆలయాలు తిరుగుతూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇతడు చట్టాలపై మంచి పట్టు తెచ్చుకున్నారు. 2015లో తన కూతురి అడ్మిషన్ విషయంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై కేసు వేసి గెలిచారు.

Similar News

News February 11, 2025

స్టాక్‌మార్కెట్ల క్రాష్: 4 నెలల్లో ₹85లక్షల కోట్ల నష్టం

image

స్టాక్‌మార్కెట్లు పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద కనీవినీ ఎరగని విధంగా ఆవిరవుతోంది. గత SEP 27న నిఫ్టీ 26,277 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 3500 పాయింట్లు పడిపోయింది. అంటే 13% పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు నవంబర్లో రూ.31L CR, డిసెంబర్లో రూ.10L CR, జనవరిలో రూ.27L CR, ఫిబ్రవరిలో రూ.15L CR మొత్తంగా సుమారు రూ.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.

News February 11, 2025

కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు

image

AP: ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న <<15428552>>బర్డ్ ఫ్లూ<<>> కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం(M)లో వైరస్ నిర్ధారణ అయ్యింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల 10KM పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. కాగా 100డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

News February 11, 2025

18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ

image

సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్‌లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.

error: Content is protected !!