News March 20, 2024
నల్గొండ, భువనగిరిలో మొదలైన సందడి..!

ఉమ్మడి నల్గొండలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకానుంది. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 11, BRS 1 ఓ చోట విజయం సాధించాయి. ఖాతా తెరవకున్న బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
Similar News
News March 16, 2026
నల్గొండ: ప్రజావాణికి పోటెత్తిన అర్జీలు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 105 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 60, ఇతర శాఖలకు 45 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 16, 2026
నల్గొండ: దివ్యాంగుల కోసం ప్రతి నెలాఖరున ‘ప్రత్యేక ప్రజావాణి’

దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నెల 28న దీన్ని ప్రారంభిస్తున్నామని, దీనికి అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రంజాన్ తోఫా పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.


