News February 11, 2025
దమ్మపేట: యువకుడిపై పోక్సో కేసు

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన ఓ విద్యార్థినిని మందలపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర బార్గవ్ లైంగికంగా వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
Similar News
News September 15, 2025
వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

జపాన్‌లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
News September 15, 2025
“ఉల్లాస్” నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో కరీంనగర్

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఉల్లాస్‌లో భాగంగా జిల్లాలో 32777 మంది నమోదు లక్ష్యం నిర్ణయించగా 69958 మందిని ఈ కార్యక్రమంలో చేర్పించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ లో అడ్మిషన్లు, స్వయం సహాయక సంఘాల్లో బాలికలు, వయోవృద్ధులు, దివ్యాంగులను చేర్పించడం వంటి కార్యక్రమాల్లోనూ జిల్లా ముందు వరుసలో ఉంది. అధికారులను కలెక్టర్ అభినందించారు.
News September 15, 2025
KNR: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత’

సోమవారం ప్రజావాణి కార్యక్రమానంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 27580 దరఖాస్తులు రాగా 1810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు.