News February 11, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.
Similar News
News November 9, 2025
ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.
News November 9, 2025
MNCL: అండర్-14 క్రికెట్ బాలుర జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో అండర్-14 క్రికెట్ బాలుర జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
News November 9, 2025
GWL: ఆర్డీఎస్‌ను పటిష్ఠం చేయాలి..!

టీబీ డ్యామ్ ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించే (రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ఆర్డీఎస్ ఆనకట్టను పటిష్ఠ పరచాలని అలంపూర్ రైతులు అంటున్నారు. చాలా కాలం క్రితం నిర్మించిన ఆనకట్ట బకెట్ వ్యవస్థ దెబ్బతింది. భారీ వరదకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బకెట్ వ్యవస్థ పటిష్ఠతకు గతంలో పనులు ప్రారంభించినా పూర్తి చేయలేదు. ఈ ఏడాది వేసవి కాలంలో బకెట్ వ్యవస్థను పటిష్ఠం చేయాలని రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు.


