News February 11, 2025
రేపల్లె: న్యాయవాది ప్రభాకరరావు మృతి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె కోశాధికారి ప్రముఖ సోషల్ వర్కర్ అడిషనల్ ప్రభాకర్ రావు గుండెపోటుతో మృతి చెందారు. రేపల్లె ప్రాంత ప్రజలకు న్యాయవాదిగా, సోషల్ వర్కర్‌గా ఆయన సుపరిచితుడు. రెడ్ క్రాస్‌కు ప్రభాకర్ రావు చేసిన సేవలు ఎనలేనివని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ వసంతం వీర రాఘవయ్య అన్నారు. రెడ్ క్రాస్ బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ రావుకు నివాళులర్పించారు.
Similar News
News September 18, 2025
జగిత్యాల: తండ్రి మందలించాడని కుమారుడి సూసైడ్

జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన రాహుల్ (బీటెక్ విద్యార్థి) కొంత కాలంగా ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన తండ్రి శ్రీనివాస్ మందలించడంతో రాహుల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2025
కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.
News September 18, 2025
పోషకాహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం: KMR కలెక్టర్

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని KMR కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండలం పోతాయిపల్లిలో జరిగిన ‘స్వచ్ఛతా హీ సేవ-2025’, ‘పోషక్ అభియాన్’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ‘పోషక్ అభియాన్’ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పోషక మాసం నిర్వహిస్తూ పౌష్టికాహారం విలువను తెలియజేస్తున్నామన్నారు.