News February 11, 2025
సోంపేట: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739237104159_1128-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షావుకారి డిల్లేశ్వరరావు (75) మద్యం మత్తులో తన భార్య రత్నాలు(70)పై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, అందులో ఒకరు మృతి చెందగా మరో కుమారుడు టీ దుకాణం నడిపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై లవరాజు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 11, 2025
శ్రీకాకుళం: క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289896572_60370705-normal-WIFI.webp)
రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
News February 11, 2025
శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739281354046_697-normal-WIFI.webp)
శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 34 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. >Share it
News February 11, 2025
అరసవల్లి ఆదిత్యుని హుండీ లెక్కింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274150680_52220160-normal-WIFI.webp)
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.