News February 11, 2025

రైతులకు యూనిక్ కోడ్.. పొందడం ఎలా?

image

‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రాజెక్టులో భాగంగా రైతులకు కేంద్రం 11 నంబర్లతో కూడిన యూనిక్ కోడ్‌ను కేటాయిస్తోంది. ఈ ప్రక్రియ నిన్న ఏపీలోనూ ప్రారంభమైంది. తొలి రోజు 63వేల మందికి UC జారీ అయినట్లు సమాచారం. దీనికోసం apfr.agristack.gov.in <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మీ ల్యాండ్ వివరాలు చూపిస్తుంది. సర్వే నంబర్లు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ జనరేట్ అవుతుంది.

Similar News

News October 26, 2025

అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

image

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం LICతో ₹33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న Washington Post కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల LIC వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.

News October 26, 2025

పెట్టుబడులపై ఆరోపణలు.. కంపెనీల్లో LIC వాటాలు ఇలా!

image

₹41 లక్షల కోట్ల ఆస్తులున్న LIC దేశంలోని టాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ 2014లో ₹1.56 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు 10 రెట్లు పెరిగి ₹15.6 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం పలు కంపెనీల్లో వాటాలు ఇలా.. TCS-5.02%(₹5.7 లక్షల కోట్లు) *రిలయన్స్‌-6.94%(₹1.33 లక్షల కోట్లు) *ITC-15.86%(₹82వేల Cr)*SBI-9.59%(79,361 కోట్లు) *HDFC బ్యాంకు-4.89%(₹64,725 Cr ) *అదానీ గ్రూపు-4% (₹60వేల Cr).

News October 26, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.220-240, సూర్యాపేటలో రూ.220గా ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.240, విశాఖలో రూ.270, చిత్తూరులో రూ.220-245, కర్నూలులో రూ.200-240 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో రేట్లు తగ్గలేదని, రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.