News February 11, 2025

కరీంనగర్: నేటి నుంచి భాగ్యనర్ ఎక్స్‌ప్రెస్

image

కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News March 15, 2026

KNR: ‘స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

image

స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డా.బీఎన్.రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది తప్ప ఉత్తమ ఉద్యోగ పాలసీని తయారు చేయలేక పోతున్నారని విమర్శించారు.

News March 15, 2026

కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

image

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.