News February 11, 2025

రేపు YCPలో చేరనున్న TDP మాజీ MLA కుమారుడు

image

మాజీ MLA గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీశ్ YCPలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 12న ఆయన YCP అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా ఈయన గత ఎన్నికల్లోనే నగరి నుంచి MLAగా పోటీ చేయాలని భావించినా పలు కారణాలతో అది వీలుపడలేదు.

Similar News

News September 17, 2025

TPT: మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 4వ విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గణేశ్ చెప్పారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చివరి తేదీ సెప్టెంబర్ 27.

News September 17, 2025

హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

image

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్‌ పోలో‌తో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.

News September 17, 2025

జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

image

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.