News February 11, 2025

పెద్దపల్లి: నేటి నుంచి భాగ్యనర్ ఎక్స్‌ప్రెస్

image

పెద్దపల్లి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

జగిత్యాల: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జగిత్యాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్.కె.ఎన్.ఆర్ (బాలుర) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన, సీసీ కెమెరాల పర్యవేక్షణను సమీక్షించారు. పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, శౌచాలయాల సదుపాయాలు సక్రమంగా ఉండాలని అధికారులకు సూచించారు.

News February 25, 2026

ఏలూరు: హెచ్చరిక.. నమ్మి మోసపోవద్దు

image

ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News February 25, 2026

వృద్ధులు, మహిళలకు త్వరలోనే శుభవార్త!

image

TG: ఎన్నికల హామీల్లో మిగిలిన వాటినీ అమలు చేసేలా కొత్త స్కీమ్‌లపై GOVT దృష్టి సారించింది. వృద్ధాప్య పెన్షన్ ₹4000కు పెంపు, మహిళలకు ₹2500 సాయం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌లకు నిధుల అందుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే CMకు నివేదించింది. రానున్న బడ్జెట్లో వీటిని ప్రకటించనున్నట్లు సమాచారం. వీటికోసం ఆయా శాఖలు అందించే ప్రతిపాదనలపై బడ్జెట్ సమావేశాలకు ముందు క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకుంటారు.