News February 11, 2025
HNK: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News October 18, 2025
KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.
News October 18, 2025
ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

TG: లిక్కర్ షాప్స్‌కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
News October 18, 2025
కండ్లపల్లి చెరువు కట్ట పరిశీలన.. డ్యామ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

జగిత్యాల శివారులోని కండ్లపల్లి చెరువు కట్ట ఇటీవల కుంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం కట్టను పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన పనులను సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ తనిఖీలో విశ్రాంత ఎన్‌సీ రామరాజు, సేఫ్టీ అధికారిణి విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు పాల్గొన్నారు.