News February 11, 2025
BNGR: యథాతథంగా భాగ్యనగర్ రైలు

భువనగిరి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి ఈ నెల 15 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. కాగా రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News September 16, 2025
ACS అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.కోటికి పైగా నగదు, రూ.కోటి విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూ సంబంధిత అంశాలలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 6 నెలలుగా ఆమెపై ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిఘా పెట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
News September 16, 2025
పిల్లలకు డైపర్లు వేస్తున్నారా?

పిల్లలకు డైపర్లు వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. *2 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడొచ్చు *ఇంట్లో ఉన్నప్పుడు కాటన్‌వి, ప్రయాణాల్లో డిస్పోజబుల్ డైపర్లు వాడటం మేలు *డైపర్లను ఎక్కువసేపు మార్చకుండా వదిలేస్తే ఒరుసుకుపోవడం, గజ్జల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది *డైపర్ విప్పాక అవయవాలకు గాలి తగిలేలా ఉండాలి *గోరువెచ్చని నీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాక కొత్తది వేయాలి.
News September 16, 2025
సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.