News February 11, 2025
కాశీలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి మృతి

కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పీటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News January 16, 2026
NTR ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టా వేదికగా ధ్రువీకరించారు. అనిల్ కపూర్ రాకతో మూవీ హైప్ అమాంతం పెరిగింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
News January 16, 2026
ఎల్లుండి ‘మౌని అమావాస్య’.. ఏం చేయాలి?

మౌని(చొల్లంగి) అమావాస్య ఈ ఏడాది JAN 18న వచ్చింది. 18న 12.03amకి ప్రారంభమై 19న 1.21amకు ముగుస్తుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని నమ్మకం. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నీళ్లు, నువ్వులతో తర్పణాలు వదిలితే వారు ఉత్తమ లోకాలకు చేరుకొని ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు. మౌన వ్రతం, శివుడికి రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందట.
News January 16, 2026
భద్రాద్రి: మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లు

తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులాల అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం సూచించారు. మైనార్టీ గురుకుల పాఠశాల ఐదవ తరగతి, కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించాలని కోరారు. బూర్గంపాడు(G), భద్రాచలం(B), అశ్వారావుపేట(G) ఇల్లందు(G) విడివిడిగా ఐదవ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ముస్లిం మైనారిటీ పిల్లలను తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలన్నారు.


