News February 11, 2025
HYD: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
HYD ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతున్నట్లు ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి భువనగిరి, కాజీపేట్, పెద్దపల్లి, కాగజ్‌నగర్ వెళ్తుంది. మళ్లీ 15న సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
HYD: వేధింపులకు గురిచేస్తున్నారా..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
మహిళలు, యువతులు వేధింపులకు గురి అయితే ధైర్యంగా షీ టీమ్‌ని సంప్రదించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా మీ ప్రాంత షీ టీమ్ అధికారుల నంబర్లు: ఇబ్రహీంపట్నం 8712662600, కుషాయిగూడ 8712662601, ఎల్బీనగర్ 8712662602, మల్కాజ్గిరి 8712662603, వనస్థలిపురం 8712662604, నంబర్లకు వాట్సాప్ ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.
News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి
మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2025
HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!
ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.