News February 11, 2025

నారాయణపేట జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు ఎన్ని అంటే..?

image

నారాయణపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని 13 మండలాల్లో 4,67,217 మంది ఓటర్లు ఉన్నారు. 3,500 మందికి ఒక MPTC చొప్పున జిల్లాలో 136 MPTC, 13 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందు సర్పంచ్ ఎన్నికలా.. లేక మండల పరిషత్ ఎన్నికలా? అన్న చర్చ ప్రజలలో జరుగుతోంది.

Similar News

News July 5, 2025

విజయనగరం: మా భవాని ‘బంగారం’

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్‌లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 5, 2025

సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

image

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.

News July 5, 2025

కనుల పండువగా సాగిన జగన్నాథ రథయాత్ర

image

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా సాగింది. మొత్తం 10 కి.మీ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ.3 గం.కు ప్రారంభమైన రథయాత్ర సా.6 గంటలకు ముగిసింది. హనుమకొండ చౌరస్తా, KMC, ఎంజీఎం, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్ వరకు సాగి అక్కడే యూటర్న్ తీసుకొని ఎంజీఎం మీదుగా ములుగు రోడ్డు సమీపంలోని వేంకటేశ్వర గార్డెన్‌కు చేరుకొని ముగిసింది.