News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 23, 2025
నాగర్‌కర్నూల్: 60 రోజులు.. కొనసాగుతున్న అన్వేషణ..!

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి SLBC సొరంగంలో ప్రమాద ఘటనకు 60 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఆరుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. డీ-1 నుంచి డీ-2 ప్రదేశం వరకు దాదాపు శిథిలాలు తొలగించారు. డేంజర్ జోన్ అయిన మిగిలిన 43 మీటర్ల పరిధిలో ఆ ఆరుగురి మృతదేహాలు ఉండొచ్చని సిబ్బంది అభిప్రాయానికి వచ్చారు. 12 రకాల విభాగాల అధికారులు నిత్యం రెస్క్యూ చేస్తున్నారు.
News April 23, 2025
నారాయణపేట: బాలికపై అత్యాచారం.. జైలుకు యువకుడు

NRPT జిల్లా దామరగిద్ద వాసి <<16176540>>బోయిని శ్రీనివాస్(24)<<>> ఓ బాలికను HYDలోని ఓ కిరాయి రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని పట్టుకుని కోస్గి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. అతడిని MBNR సబ్ జైలుకు తరలించామన్నారు.
News April 23, 2025
గద్వాల: ఇంటర్ FAIL అవుతానేమోనని చనిపోయాడు.. కానీ పాసయ్యాడు!

ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా మల్దకల్(M) మల్లెందొడ్డికి చెందిన వినోద్(18) గద్వాల GOVT జూనియర్ కాలేజీలో ఇంటర్ 1st YEAR చదువుతున్నాడు. తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయంతో ఇటీవల పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అయితే మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.