News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 14, 2026
కామారెడ్డి: భోగి సంబరం.. ముంగిళ్లలో విరిసిన రంగవల్లులు!

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ తొలిరోజైన ‘భోగి’ వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే మహిళలు తమ వాకిళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. పండుగను పురస్కరించుకుని పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువతులు పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసిన నిర్వాహకులు, విజేతలకు బహుమతులను అందజేశారు.
News January 14, 2026
PPPలో వైద్యసేవలపై కేంద్రం మార్గదర్శకాలు

AP: PPP విధానంలో మెరుగైన వైద్యసేవల కోసం 5 మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది. ఈమేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. న్యూక్లియర్ మెడిసిన్, MMUలు, డెంటల్, రేడియాలజీ, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను PPPలో విస్తరించాలంది. ఎక్విప్, ఆపరేట్, మెయింటైన్ (EOM), ఆపరేట్ అండ్ మెయింటైన్(O and M)ల ద్వారా సేవలు పెంచాలని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలకు చెల్లింపుల విధానంపై కూడా మార్గదర్శకాలను అందించింది.
News January 14, 2026
ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.


