News February 11, 2025
పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్

కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News January 14, 2026
ప.గో: ‘బరి’లో సస్పెన్స్.. పైచేయి ఖాకీదా? ఖద్దరుదా?

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అయితే, ఈ ఏడాది భోగి రోజున ఉదయం 10:40 గంటలు కాస్తున్నా, పందాలకు అనుమతులు లభించలేదు. దీంతో పందెం రాయుళ్లు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పైచేయి ఖాకీదా ? ఖద్దరుదా ? తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం(M) కడియద్ద, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, తాడేపల్లిగూడెంలోని బరులను ధ్వంసం చేశారు.
News January 14, 2026
173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (<
News January 14, 2026
సంక్రాంతి వచ్చిందంటే ఓరుగల్లులో జాతరలే..!

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు ఓరుగల్లు ఆధ్యాత్మికాన్ని పులుముకుంటుంది. ఐనవోలు, కొమురవెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, మేడారం సమ్మక్క-సారలక్క ఇలా ప్రతీ జాతర పెద్ద ఎత్తున సాగుతుంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు సంక్రాంతి పండగకు ఓరుగల్లు వైపు చూస్తారు. ఇక జాతరలతో పాటు పర్యాటక ప్రాంతాలు బోలేడు. ఈ నెలంతా అవి సందర్శకులతో కిటకిటలాడుతాయి.


