News March 20, 2024

ఎద్దుల బండిని ఢీకొన్న కారు.. యువకుడి మృతి

image

ఎద్దుల బండిని కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. హిందూపురం వైపు నుంచి కొట్నూరు వెళుతున్న ఎద్దుల బండిని కారు ఢీకొని ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Similar News

News March 15, 2026

అనంతలో ఆశాజనకంగా చీనీ ధరలు

image

చీనీ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. తగ్గుముఖం పడుతున్న టమాటా ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.23 వేలు, కనిష్ఠ ధర రూ.8 వేలు పలికింది. అనంతపురం నగరానికి సమీపాన ఉన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.7, కనిష్ఠంగా రూ.4 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి.

News March 15, 2026

అనంత: పన్ను కట్టాల్సిందే.. ప్రజలకు డీపీవో అల్టిమేటం!

image

బకాయిదారు లబ్ధిదారు తప్పనిసరిగా ఇంటి పన్ను చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. పన్ను విషయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. లక్షల్లో బకాయిలు ఉన్నవారు చాలామంది ఉన్నారన్నారు. పెండింగ్ బకాయిదారుల జాబితా తయారు చేశామన్నారు. ఇంటి పన్ను నెలాఖరులోగా తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఎక్కువగా ఉన్న బకాయిదారులు స్పందించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

News March 15, 2026

చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్

image

పెద్దవడుగూరు మండలం విరుపాపురంలో యువకుడు కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం ఇంటర్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. సప్లమెంటరీ రాసుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. కళ్యాణ్‌కు చదువుకోవడం ఇష్టం లేక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.