News February 11, 2025
రోహిత్‌లాగే కోహ్లీ ఫామ్‌లోకి వస్తారు: మురళీధరన్
రోహిత్ శర్మలానే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకుంటారని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. భారత్‌తోపాటు పాక్, బంగ్లా, అఫ్గాన్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరికి పాకిస్థాన్ పిచ్‌లు బాగా సహకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా? ఇలా చేయండి!
ఇన్‌స్టా వాడే పిల్లలు, టీనేజర్ల కోసం ‘మెటా’ ఇండియాలో టీన్ ఖాతాలను ప్రవేశపెట్టింది. ఇందులో పిల్లలకు అసభ్యకర పోస్టులు, సెన్సిటివ్ కంటెంట్ కనిపించకుండా, అధునాతన సెక్యూరిటీతో ప్రైవసీ ఉంటుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో కఠినమైన ప్రైవసీ సెట్టింగ్స్, కంటెంట్ గోప్యతా సెట్టింగ్‌లు, కంటెంట్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. 16ఏళ్లలోపు వారు ఈ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉంటే అది టీన్ ఖాతాలోకి మారిపోతుంది.
News February 11, 2025
ఉద్యోగం కోసం రోజూ 700KMS ప్రయాణం!
హైదరాబాద్‌లో ఉంటోన్న ఉద్యోగులను అడగండి రోజూ ట్రాఫిక్‌లో ప్రయాణం ఎలా ఉంటుందో. అలాంటిది ఉద్యోగం కోసం రోజూ 700 కి.మీలు ప్రయాణిస్తోందో మహిళ. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో పనిచేస్తున్నారు. పెనాంగ్‌లో నివాసముంటుండగా వారంలో 5 రోజులు విమానంలో ఆఫీసుకెళ్తుంటుంది. ఉదయం 4గంటలకే లేచి ఆఫీసుకు వెళ్తానని ఆమె చెప్పారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 11, 2025
ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?
TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.