News February 11, 2025

WGL: అన్నదాతకు ఊరట.. రూ.100 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 15 రోజుల అనంతరం నేడు మార్కెట్లో పత్తి ధర రూ.7వేల మార్క్ దాటింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. నేడు రూ.7,060 పలికినట్లు అధికారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.100 పెరగడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 16, 2025

దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

image

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>

News November 16, 2025

కర్మయోగి భారత్‌లో ఉద్యోగాలు

image

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: igotkarmayogi.gov.in

News November 16, 2025

రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

image

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2