News March 20, 2024
నేడే ఎన్నికల తొలి నోటిఫికేషన్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇవాళ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, 30న ఉపసంహరణకు తుది గడువు. వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. అత్యధికంగా తమిళనాడులో ఒకే విడతలో 39 స్థానాలకూ పోలింగ్ నిర్వహించనున్నారు.
Similar News
News January 15, 2025
BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.
News January 15, 2025
‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. నిర్మాత ఆవేదన
‘గేమ్ ఛేంజర్’ రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్‌లో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత SKN ట్వీట్ చేశారు. ‘సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
News January 15, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.45కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. వెంకటేశ్‌కు ఇవే ఆల్ టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.