News February 11, 2025

సైఫ్‌కు ప్లాస్టిక్ కత్తి ఇచ్చిన కొడుకు.. ఎందుకంటే?

image

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Similar News

News November 11, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ‌, తిరుప‌తి, అమ‌రావ‌తిల‌ను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
* కర్నూలు(D) బ్రాహ్మణపల్లిలో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు శంకుస్థాపన జరిగింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బేవరేజస్ ప్లాంట్: మంత్రి టీజీ భరత్

News November 11, 2025

ముకేశ్ అంబానీపై CBI విచారణకు పిటిషన్

image

$1.55B విలువైన ONGC గ్యాస్‌ను దొంగిలించారంటూ రిలయన్స్, ముకేశ్ అంబానీపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నమ్మకద్రోహం, అక్రమాలతో గ్యాస్‌ను థెఫ్ట్ చేశారని, CBIతో విచారణ చేయించాలని జితేంద్ర పి మారు అనే వ్యక్తి కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు CBI, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే భూమి బ్లాక్‌ల మధ్య గ్యాస్ కదలికలు సహజమని, దాన్ని వెలికితీసే అధికారం తమకు ఉందని RIL పేర్కొంటోంది.

News November 11, 2025

చింతపండుతో శరీరంలోని మైక్రో ప్లాస్టిక్ ఔట్!

image

చింతపండు మైక్రోప్లాస్టిక్‌లతో పోరాడగలదని కొత్త అధ్యయనంలో తేలింది. దీనిలోని ఆమ్లాలు, ఫైబర్స్ జీర్ణవ్యవస్థలో ఉన్న మైక్రోప్లాస్టిక్ కణాలను బంధించి, వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడతాయి. ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి చేరే మైక్రో ప్లాస్టిక్‌ను ఇది తొలగిస్తుంది. కాలేయ శుద్ధి, జీర్ణక్రియకు సహాయపడే ఈ చింతపండు ఇప్పుడు ఆధునిక కాలుష్యం నుంచి కూడా రక్షించగలదని ఈ పరిశోధన సూచిస్తోంది.