News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Similar News
News February 25, 2026
కుళాయి నీటితో పూజ చేయవచ్చా?

బావులు, నదులు అందుబాటులో లేనప్పుడు కుళాయి నీటిని కూడా పూజకు వాడొచ్చంటున్నారు పండితులు. ‘జలం అమృతంతో సమానం. మనం తాగే శుభ్రమైన నీటినే దైవ కార్యాలకు వినియోగించవచ్చు. అయితే, ఆ నీటిని పాత్రలో తీసుకున్నప్పుడు పుణ్యనదులను స్మరిస్తే అది మరింత పవిత్రంగా మారుతుంది. వనరులు లేనప్పుడు ఉన్నవాటినే భక్తితో సమర్పించాలి. నిత్యకర్మలను ఆపకూడదు. చిత్తశుద్ధి వీడకూడదు. లభించిన నీటితోనే పూజ చేయాలి’ అంటున్నారు.
News February 25, 2026
తొలిరోజు ‘ఇంటర్’ ప్రశాంతం: 97 శాతం హాజరు

జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు పరీక్షకు మొత్తం 19,636 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 19,099 మంది (97 శాతం) పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. వీరిలో జనరల్ విభాగం నుంచి 17,989 మంది, ఒకేషనల్ నుంచి 1,110 మంది ఉన్నారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖ తెలిపింది.
News February 25, 2026
సంగారెడ్డి: 17,616 మంది విద్యార్థుల హాజరు

సంగారెడ్డి జిల్లాలోని 54 పరీక్ష కేంద్రాలో ఉదయం మొదటి సంవత్సరం మొదటి లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 18,179 మంది విద్యార్థులకు గాను 17,616 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి గోవిందరామ్ మీడియాతో తెలిపారు. విద్యార్థుల హాజరు 96.90%గా ఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.


