News March 20, 2024

గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నేపథ్యమిదే

image

తెలంగాణ గవర్నర్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు BJP MPగా ఎన్నికయ్యారు. రాష్ట్ర BJP చీఫ్‌గానూ పనిచేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్‌గా(2016-2019) సేవలందించారు. గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేయనున్నారు.

Similar News

News March 16, 2026

రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు: CM

image

TG: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ సూచించారు. ‘అనవసర వివాదాల్లో ఇరుక్కోవద్దు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాపే వచ్చే ఎన్నికలకు అజెండా అవుతుంది’ అని దిశానిర్దేశం చేశారు.

News March 16, 2026

క్యాన్సర్‌తో ప్రతి 18నిమిషాలకు ఒకరు మృతి

image

తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుండగా, ప్రతి 18 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 53,565 కొత్త కేసులు, 29,300 మరణాలు సంభవించాయి. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ ముప్పు 15% ఎక్కువగా ఉంది. పొగాకు వాడకం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే ఇందుకు ముఖ్య కారణాలు.

News March 16, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.