News February 11, 2025
వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739255090796_1047-normal-WIFI.webp)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.
Similar News
News February 11, 2025
బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739279659330_695-normal-WIFI.webp)
ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.
News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289303156_50308805-normal-WIFI.webp)
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
News February 11, 2025
హనుమకొండ: చికెన్ సెంటర్ యజమానికి రూ.30 వేల పెనాల్టీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739286521645_51243309-normal-WIFI.webp)
అపరిశుభ్ర ప్రదేశంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి రూ.30 వేలు పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్యఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. న్యూశాయంపేటలోని వినాయక చికెన్ సప్లయర్స్ యాజమాన్యం సరియైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఆయన అన్నారు. దుకాణ ఆవరణ అపరిశుభ్రంతో పాటు చికెన్ వ్యర్థాలను డ్రైనేజీలో వదిలినందకు పెనాల్టీ విధించామన్నారు.