News February 11, 2025
వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.
Similar News
News November 5, 2025
చివరకు దళారులను ఆశ్రయించాల్సిందేనా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల, తాళ్లపల్లి, గాలిపెల్లిలోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి గరిష్ఠంగా ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనుండడంతో మిగతా పత్తిని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిందేనా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 5, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✦ రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
✦ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ.. సరిహద్దు మార్పులపై నివేదిక రెడీ చేయనున్న మంత్రులు.. NOV 10న క్యాబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనపై చర్చ.. మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు
✦ నకిలీ మద్యం కేసు CBIకి ఇవ్వాలంటూ హైకోర్టులో జోగి రమేశ్ పిటిషన్.. 12వ తేదీకి విచారణ వాయిదా
News November 5, 2025
BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

ఈ నెల 22, 23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్‌లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


